- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెలలో రైతు భరోసా..అదిరియే ప్రకటన చేసిన మంత్రి వివేక్
ఈ నెల నుంచి రైతు భరోసా నిధుల పంపిణీ ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ మంత్రి వివేక్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది. రైతు భరోసా ( Rythu Bharosa) నిధుల విడుదలపై తాజాగా తెలంగాణ మంత్రి వివేక్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల నుంచి రైతు భరోసా నిధుల పంపిణీ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. రైతు భరోసా కింద మొత్తం రూ.9000 కోట్లకు పైగా రైతుల ఖాతాలలో వేయనున్నట్లు వెల్లడించారు. మార్చి మాసంలో తొలి విడతగా రూ. 4500 కోట్లు విడుదల చేస్తామని తెలిపిన మంత్రి వివేక్, మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రజల కోసం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. సన్న వడ్లు పండించే 90% రైతులకు బోనస్ కూడా అందిస్తున్నట్లు వివరించారు మంత్రి వివేక్. నిత్యం రైతుల సంక్షేమం అన్నట్లుగానే తమ ప్రభుత్వం నడుస్తుందని వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు అయిన వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం రైతన్నల కోసం కృషి చేయాలని తెలిపారు.
ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు చేశారు. డీసీఎంఎస్, ఐకేపీ సెంటర్ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మొత్తం మార్కెట్ కమిటీ పైన ఉంటుందని గుర్తు చేశారు. అదే సమయంలో గత కేసీఆర్ సర్కారుపై విమర్శలు కూడా చేశారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రాజెక్టును పక్కకు పెట్టి కాళేశ్వరం ఎందుకు కట్టారని నిలదీశారు.






