- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు.. ఫోన్లు చెక్ చేసుకోండి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం ప్రవేశ పెట్టిన రైతు భరోసా నిధులు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం ప్రవేశ పెట్టిన రైతు భరోసా నిధులు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో జరిగిన రైతు నేస్తం(Rythunestham) కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి ప్రోగ్రాం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై మంత్రి తుమ్మల ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వానాకాలం 2025 రైతు భరోసా నిధులను రైతు ఖాతాలలోకి జమ చేయడం ఆరంభించడం జరిగిందని తెలిపారు.
రైతు భరోసాలో భాగంగా ఈ రోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా నిధుల జమ చేయడం జరిగిందని. 41.25 లక్షల మంది రైతులకు సంబంధించిన 39.16 లక్షల ఎకరాలకు గాను 2349.83 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామని.. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే 9 రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు మెసేజ్ లు వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో వెంటనే చెక్ చేసుకొండి.






