ఇక తెలంగాణలో గ్రామీణ రోడ్లకు మహార్దశ

by Muthe.Rajitha |

ఇకపై పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ తెలంగాణ వ్యాప్తంగా ‘హోమ్’ ప్రాజెక్టు విధానాన్ని అవలంభించబోతున్నారు.

ఇక తెలంగాణలో గ్రామీణ రోడ్లకు మహార్దశ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇకపై పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ తెలంగాణ వ్యాప్తంగా ‘హోమ్’ ప్రాజెక్టు విధానాన్ని అవలంభించబోతున్నారు. తద్వారా గ్రామీణ రోడ్లకు మహార్దశ పట్టనుంది.. పట్టణ రోడ్లకు దీటుగా పల్లెల్లోని రోడ్లన్నీ మెరువనున్నాయి. ప్రస్తుతానికి ఈ విధానం కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే అవలంభిస్తున్నారు. అయితే, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నూతన విధానం అమలులోకి తేవాలని నిర్ణయించారు. ఈక్రమంలోనే గతంలో జరిగిన క్యాబినెట్ భేటీలో హమ్ విధానాన్ని ఆమోదించారు. హామ్ ప్రాజెక్టుకు సంబంధించి మార్గదర్శకాలతో నేడో రేపో జీవో విడుదల చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

మంగళవారం సచివాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క ఈమేరకు వెల్లడించారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో హామ్ విధానాన్ని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా హోమ్​ప్రాజెక్టు అధ్యాయానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు అధికారుల బృందాలు పంపిస్తామని చెప్పారు. ఆ రెండు రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేసి హామ్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ హోమ్ విధానం ద్వారా మొత్తం 18,472 కిలోమీటర్ల మేరా, మొదటి విడతలో 7947 గ్రామీణ రహదారులను ఆధునికరిస్తామన్నారు. 15 రోజుల్లో టెండర్లు వేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పనుల జాతర..

ఉపాధి నిధుల ద్వారా ఇప్పటికే రూ. 1800 కోట్ల పనులను మంజూరు చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతరను ప్రారంభిస్తామన్నారు. ఈ దఫా గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్​వాడీ భవనాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ప్రతి మండలానికి రెండు చొప్పున మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 1440 జీపీ భవనాలు, 1440 అంగన్​వాడీ భవనాలను ఈ ఏడాది నిర్మించనున్నామని చెప్పారు. గత ఎడాది చేపట్టిన పనుల జాతర సక్సెస్ అయ్యింది, ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు పల్లెల్లో ఆస్తులను సృష్టించామని తెలిపారు.

పంట పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణం వంటి వ్యవసాయ అనుబంధ పనులను ఎక్కువగా చేపడుతున్నారన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో ప్రతి విభాగం నెలవారీగా టార్గెట్లు రూపొందించుకొని పనిచేయాలన్నారు. ఎక్కువగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు తక్కువగా చేయడ వల్ల ఎలాంటి లాభం లేదని, ఎంతోకాలంగా గ్రౌండింగ్ కానీ పనులను రద్దు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు.

రెండు ఫైళ్ళకు కొద్దిరోజుల్లో క్లియరెన్స్..

గ్రామాలను అభివృద్ధి చేయాలి, పనులు, ఫైళ్లు పెండింగ్​వద్దు.. త్వరగా డిస్పోస్ చేయాలి, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని మంత్రి సీతక్క సూచించారు. నెలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని పని చేయాలన్నారు. నెలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని కార్యాచరణ రూపొందించుకునే పని చేయాలన్నారు. మెరుగైన సేవలు అందించేందుకు మన శాఖలో ఉద్యోగులంతా కష్టపడుతున్నారు, వారి సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగ సమస్యలను పరిష్కరించాం, 93 వేల గ్రామస్థాయి ఉద్యోగులకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఎంపీడీవోల బదిలీల ఫైలు సీఎం వద్ద ఉందని, ఎంపీడీవోలకు వాహనాల అలవెన్స్ ఫైల్ ఆర్థిక శాఖ వద్దకు చేరింది.

ఈ రెండు ఫైళ్ళకు కొద్దిరోజుల్లో క్లియరెన్స్ వస్తోందని మంత్రి తెలిపారు. పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సమీక్ష సమావేశంలో శాఖల వారీగా జరుగుతున్న పనుల పురోగతిని, అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలను, హమ్ విధానంలో రోడ్ల నిర్మాణం, ఇందిరా మహిళా శక్తి, స్త్రీ నిధి, మిషన్ భగీరథ, ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై హెచ్వోడీలు ప్రజెంటేషన్లు ఇచ్చారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎన్. శ్రీధర్ కు మంత్రి సీతక్క ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Next Story