- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సామాజికం’పై అధికార పార్టీ ఫోకస్..! బై పోల్ వేళ జోరుగా సమావేశాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అటు సామాజికవర్గాల ఓట్లు, ఇటు మతపరమైన ఓట్లు కీలకం కావడంతో కాంగ్రెస్ ఆయా వర్గాల ఓట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అటు సామాజికవర్గాల ఓట్లు, ఇటు మతపరమైన ఓట్లు కీలకం కావడంతో కాంగ్రెస్ ఆయా వర్గాల ఓట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల ఓట్లు సుమారు 1.2లక్షలకు పైగానే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పెద్దసంఖ్యలో ఉన్న వారి ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ఆయావర్గాల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు, తమ అభ్యర్థి గెలిచిన తర్వాత చేయబోయే పనులపై హామీలు ఇస్తున్నారు. తాజాగా క్రికెటర్, కాంగ్రెస్సీనియర్నేత అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఖాయం కావడంతో కాంగ్రెస్‌పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నదన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది.
సామాజికవర్గాల ఓట్లకు గాలం
సామాజికవర్గాల ఓట్లను దక్కించుకునేందుకు ఆయా నేతలతో కాంగ్రెస్ లీడర్లు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా, కమ్మ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తమ మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని వారు సీఎంకు హామీ ఇచ్చారు. పార్టీలోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేయగా రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇటీవల క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనాన్ని పార్టీ నిర్వహిచింది. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తదితర నేతలు పాల్గొన్నారు. పార్టీ మైనార్టీ నేతలతో టీపీసీసీ చీఫ్ కీలక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో కులాల వారీగా వన భోజనాల కార్యక్రమాలను సైతం నిర్వహించేందుకు పార్టీ సిద్ధం చేస్తున్నదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పాగా వేయాలన్న వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నది.






