- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పైసా ఖర్చులేని యూనియన్ గుర్తింపును ఎందుకివ్వరు? మంత్రికి ఆర్టీసీ యూనియన్ కీలక విజ్ఞప్తి
యూనియన్లను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదని టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ (ఎస్‌డబ్ల్యుయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ హయాంలో 2019లో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించకుండా వాటిని రద్దు చేశారని, అయితే తాము అధికారంలోకి వస్తే యూనియన్లను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదని టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ (ఎస్‌డబ్ల్యుయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం గాంధీభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందించారు. కేసీఆర్ హయాంలోనే 2023లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా అప్పుడు ఫలితం లేకుండా పోయిందన్నారు. ఎన్నికల సమయంలో గుర్తింపు సంఘాల పునరుద్ధరణకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా స్పందన లేదని మంత్రి దృష్టికి తీసుకు పోయారు. యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు పైసా ఖర్చు కాకపోయినా స్పందించకపోవడం తమను ఎంతో ఆవేదనకు గురి చేస్తుందని రాజిరెడ్డి మంత్రి ఉత్తమ్‌కు తెలిపారు. మంత్రి చొరవ తీసుకుని సీఎం దృష్టికి తీసుకు పోయి 40వేల మంది కార్మికుల ప్రధాన సమస్యను తీర్చాలని విజ్ఞప్తి చేశారు.






