- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG RTC: శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ఆర్టీసీ తీపి కబురు
శివభక్తుల సౌకర్యార్థం శివరాత్రి పర్వదినాన స్పెషల్ బస్సులు నడుపబోతున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మహా శివరాత్రి (Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం స్పెషల్ సర్వీసులను (TGSRTC Special Buses) నడుపుబోతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించిందని ఈ నెల 15న మహా శివరాత్రి కాగా, ఈనెల 14 నుంచి 16వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపబోతున్నదని బుధారం ఓ ప్రకటనలో పేర్కొంది. శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్‍లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‍బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు శివరాత్రి ఆపరేషన్స్ పై ఉన్నతాధికారులతో సంస్థ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించి శివరాత్రి పండుగకు శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గత శివరాత్రి కన్నా ఈ సారి 208 బస్సులను అదనంగా సంస్థ నడపనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
చార్జీల్లో సవరణ:
రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 1.5 టైమ్స్ వరకు టికెట్ ధరలను సవరించినట్లు పేర్కొంది. రెగ్యులర్ సర్వీస్‍లో టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని ఈ నెల 14 నుంచి 16 తేదీ వరకు (మూడు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమలవుతాయని తెలిపింది. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 15 వ తేదీ నుంచి 17 తేదీ వరకు(మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయని తెలిపారు. మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రంలో ప్రయాణానికి ఉచిత బస్సు రవాణా సదుపాయం యధావిధిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డ్ లను ఏర్పాటు చేస్తామని తెలిపింది.
ముందస్తు రిజర్వేషన్ కు చాన్స్:
హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని ఆర్టీసీ తెలిపింది. టికెట్ల బుకింగ్ ను www.tgsrtcbus.in వెబ్‍సైట్‍లో బుక్ చేసుకోవచ్చని, మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-234500332లలో సంప్రదించాలని సూచించింది.






