- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలోనే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు
త్వరలో ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి... ఎన్నికైన సంఘంతోనే విలీన ప్రక్రియ చేపడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

త్వరలోనే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు
ఎన్నికైన సంఘంతోనే విలీన ప్రక్రియ ప్రారంభిస్తాం
కాలుష్యంలో ఢిల్లీని దాటొద్దనే హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులు
రాష్ట్రంలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు... నగరంలోనే 540
కూకట్ పల్లి డిపోలో 60 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా శాఖ మంత్రి పొన్నం
దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి... ఎన్నికైన సంఘంతోనే విలీన ప్రక్రియ చేపడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత ప్రజా రవాణాను పెంపొందించే దిశగా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కూకట్‌పల్లి డిపోకు కేటాయించిన 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి బుధవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని మరో ఢిల్లీలా మారకూడదనే ఉద్దేశంతోనే పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్‌లోనే 540 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1050 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని ఆయన వెల్లడించారు. 2027 నాటికి నగరంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టామన్నారు. 3వేల ఈ-బస్సులను ప్రవేశపెడితే 600 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయన్నారు. త్వరలో మరో 2200 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. మహాలక్ష్మి పథకం వల్ల 310 కోట్ల టికెట్లను మహిళలు వినియోగించుకున్నారని అన్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కేపీహెచ్బీలో బస్సు డిపో ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్‌సీ అమలుతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి రెండో మంగళవారం ప్రత్యేకంగా సమయం కేటాయించనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు...
ఈ- బస్సుల విస్తరణలో భాగంగా ప్రధాన డిపోలు, బస్టాండ్‌లలో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి పేర్కొన్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేని ప్రయాణాన్ని అందించడంతో పాటు, ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని ఈ ఈవీ బస్సులు కల్పిస్తాయని ఆయన వెల్లడించారు. ఈ- బస్సుల విస్తరణలో భాగంగా ప్రధాన డిపోలు, బస్టాండ్‌లలో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేని ప్రయాణాన్ని అందించడంతో పాటు, ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని ఈ ఈవీ బస్సులు కల్పిస్తాయని వెల్లడించారు. సంస్థను లాభాల బాటలో నడిపిస్తూనే, ప్రయాణికులకు సురక్షితమైన మరియు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ నాగిరెడ్డి్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, కలెక్టర్ మను చౌదరి నూతన బస్సుల్లో ప్రయాణించారు.
- Tags
- RTC
- RTC elections






