- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RTC: రాఖీ పండగ పూట ఆర్టీసీ బిగ్ షాక్.. బస్సు చార్జీల పెంపుపై అధికారిక ప్రకటన
ఈ నెల 11వ తేదీ వరకు స్పెషల్ బస్సుల్లో చార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాఖీ పండగ వేళ టీజీఆర్టీసీ (TSRTC) ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 11 వరకు స్పెషల్ బస్సుల్లో 50 శాతం చార్జీలు పెంచినట్లు (fare hike) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. రద్దీకి అనుగుగణంగా బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికులు లేకున్నా బస్సులను వెంటనే తిరిగి తీసుకురావాల్సి వస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్వహణ ఖర్చుల నిమిత్తం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు పెంచామని వెల్లడించారు. రాఖీ పండగ (Rakshabandhan) పర్వదిన సందర్భంగా ప్రయాణిలకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని ప్రతి యేడాది మాదిరిగానే ఈ సారి కూడా రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు.
జీవో ప్రకారమే సవరణ:
ప్రధాన పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోందని తెలిపారు. ప్రధాన పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ బస్సులు నడుపుతోంది. అయితే ఆ స్పెషల్ బస్సులకు య్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని ఈ జీవో ప్రకారమే స్పెషల్ బస్సులకు టికెట్ ధరలను రాఖీ పండగ సందర్భంగ సంస్థ సవరించిందని పేర్కొంది. రాఖీ పౌర్ణమీ సందర్భంగా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు సూచించింది.






