- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VC Sajjanar : జర్నలిస్టులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందనలు
భారతదేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా నిరంతరం విధులు నిర్వహించిన మీడియా జర్నలిస్టులను సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా నిరంతరం విధులు నిర్వహించిన మీడియా జర్నలిస్టులను సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధులుగా ఉండేది జర్నలిస్టులని, వారి వృత్తి కత్తిమీదసాము లాంటిదని, జర్నలిస్టులను ఎంత పొగిడినా తక్కువేనని కొనియాడారు. శత్రుసైన్యం దాడులు చేసిన ప్రాంతాలను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రసారం చేయడం మామూలు విషయం కాదన్నారు.
"నిజాయితీ, ధైర్యం, బాధ్యతతో నివేదించే జర్నలిస్టులకు వందనం. సత్యం, ప్రజాసేవ పట్ల మీ నిబద్ధత, తరచుగా వ్యక్తిగతంగా చాలా ప్రమాదంలో ఉన్నప్పటికీ, దేశానికి సమాచారం అందిస్తున్నారు. ముఖ్యమైన పనిని చేసినందుకు ధన్యవాదాలు." అని సజ్జనార్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు.






