- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sajjanar: ఇదేనా అమ్మకు ఇచ్చే గౌరవం? తల్లిని రోడ్డున పడేశారు : వీసీ సజ్జనార్ ట్వీట్
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతి పేట గ్రామంలో దీనస్థితిలో ఉన్న కన్న తల్లికి తిండి పెట్టకుండా రైతు వేదికలో ఆమె కొడుకులు వదిలి వెళ్లిపోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా గూడూరు మండలం భూపతి పేట గ్రామంలో దీనస్థితిలో ఉన్న కన్న తల్లికి తిండి పెట్టకుండా రైతు వేదికలో ఆమె కొడుకులు వదిలి వెళ్లిపోయారు. తేలిక పాటి దుప్పటితో చలికి తట్టుకోలేక వణుకుతున్న ఆమె పరిస్థితిని చూసి కొడుకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు చొరవ చూపి వృద్దురాలిని కాపాడాలని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి.. ఆమెకు ఆశ్రయం కల్పించినట్లు సమాచారం. అయితే, కదలేని స్థితిలో ఉన్న ఆ తల్లికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో తన ఎక్స్ ఖాతా వేదికగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TGRTC MD VC Sajjanar) స్పందించారు. అమ్మా.. నీకెంత కష్టం.. అంటూ వార్త పోస్ట్ చేశారు.
78 ఏళ్ల వయసులో కాలు కదపలేని స్థితిలో ఉన్న కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ముగ్గురు కొడుకులు కర్కశకులుగా మారి ఆమెను రోడ్డున పడేశారని తెలిపారు. ఇదేనా అమ్మకు ఇచ్చే గౌరవం? అని ప్రశ్నించారు. నవమాసాలు కని పెంచిన అమ్మ అన్న కనికరం కూడా కొడుకులకు లేకపోవడం బాధాకరమని ఆవేదన తెలిపారు. కాగా, కన్న తల్లికి తిండి పెట్టకుండా రైతు వేదికలో వదిలేసిన కొడుకులపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాంటి కొడుకులు ఉన్న ఒకటే, సచ్చిన ఒకటే అని కామెంట్స్ పెట్టారు. ఆ తల్లిని ఆదుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్, స్థానిక పోలీసులకు ఎక్స్ వేదికగా ట్యాగ్ నెటిజన్లు ట్యాగ్ చేశారు.






