- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhatti Vikramarka: మహలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు 182 కోట్ల జీరో టికెట్లు: భట్టి విక్రమార్క
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై భట్టి విక్రమార్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీలో ప్రయాణించిన మహిళలకు 182 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చెప్పారు. మహాలక్ష్మి (Mahalakshmi Scheme) పేరిట ఉచిత ప్రయాణంతో కొందరు ఆందోళన చెందారని కానీ మహిళలు ఉచిత ప్రయాణం చేసినా ప్రభుత్వం ఆర్టీసీకి (RTC) రూ. 6,088 కోట్ల డబ్బులు చెల్లించిందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు పూర్తి సామర్థ్యంత నడుస్తున్నాయని అందువల్లో ఆర్టీసీ నిలదొక్కుకుందన్నారు. సోమవారం సూర్యాపేటలో ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రికల్ బస్సులను భట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, ఉత్తమ్ పద్మావతి, మందుల సామేల్ తదితరులు హాజరయ్యారు. దేశంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ఇంత విజయవంతంగా అమలు చేసిన మరో రాష్ట్రం లేదన్నారు. మహలక్ష్మి స్కీమ్ లేకపోతే ఆర్టీసీ భవిష్యత్ ఆందోళనకరంగా ఉండేదన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థలను అప్ డేట్ చేసుకుంటూ వాటిని భవిష్యత్ తరాలకు అందించడమే మాపై ఉన్న బాధ్యత అని భావిస్తున్నామన్నారు.






