- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు అవమానం.. మార్గమధ్యంలో మహిళలను దించేసిన కండక్టర్
ఆర్టీసీ బస్సులో మహిళలకు ఎదురైన అవమానకర ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మండలంలోని గోపనపల్లి గ్రామానికి చెందిన దుడేలా మల్లికార్జున స్వామి గుడి చైర్మన్ బెల్లం రాధికతో పాటు బోయిని రేవతి, బెల్లం ఉమా అనే ముగ్గురు మహిళలు ఉప్పరపెళ్లి క్రాస్ రోడ్ స్టేజి వద్ద వరంగల్ వయా అనంతరం చౌటుపల్లి రూట్ ఆర్టీసీ బస్సు ఎక్కారు.

దిశ, పర్వతగిరి : ఆర్టీసీ బస్సులో మహిళలకు ఎదురైన అవమానకర ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మండలంలోని గోపనపల్లి గ్రామానికి చెందిన దుడేలా మల్లికార్జున స్వామి గుడి చైర్మన్ బెల్లం రాధికతో పాటు బోయిని రేవతి, బెల్లం ఉమా అనే ముగ్గురు మహిళలు ఉప్పరపెళ్లి క్రాస్ రోడ్ స్టేజి వద్ద వరంగల్ వయా అనంతరం చౌటుపల్లి రూట్ ఆర్టీసీ బస్సు ఎక్కారు. తల్లిగారి ఇంటి నుంచి దాదాపు మూడు కిలోల ఎండమిర్చి బస్తా, కొన్ని చిన్న లగేజీతో పాటు ప్రయాణిస్తూ, మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్ ప్రయాణానికి ఆధార్ కార్డులు చూపించి గోపనపల్లి వరకు టిక్కెట్లు తీసుకున్నారు.
అయితే మార్గమధ్యంలో మిరపకాయల బస్తాను గమనించిన బస్సు కండక్టర్ వడ్లకొండ, మహిళలను అనంతరం క్రాస్ రోడ్డులో బలవంతంగా బస్సు దింపేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో తీవ్ర అసంతృప్తికి లోనైన బాధిత మహిళలు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని ఇలా అర్థంలేని కారణాలతో అపహాస్యం చేయడం తగదన్నారు. టికెట్ తీసుకొని సరైన ప్రయాణం కొనసాగించలేకపోవడం బాధాకరమని వాపోయారు.
ఈ విషయంలో ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకుని, ఇలాంటి అవమానాలు మళ్లీ మహిళలకు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకపై ఇలాంటి అత్యుత్సాహ చర్యలు ఎవరు చేసినా సహించబోమని బాధితులతో పాటు.. దుడేల మల్లికార్జున స్వామి గుడి చైర్మన్ బెల్లం రాధిక హెచ్చరించారు.






