- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సన్న వడ్లకు రూ.500 బోనస్ ఆగదు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సమస్యలను మూడు, నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రైతు సంక్షేమ పాలన నడుస్తోందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఉన్న పెండింగ్ సమస్యలను రాబోయే మూడు, నాలుగు రోజుల్లోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేయడానికి పదేళ్ల సమయం తీసుకుందని, కానీ తమ ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ రైతులకు రూ.21 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. గతంలో ‘వరి వేస్తే ఉరే’ అన్న పరిస్థితులు ఉండేవని, కానీ తమ ప్రభుత్వం వరి వేసిన రైతులకు మద్దతు ధరతో పాటు, సన్న వడ్లకు అదనంగా రూ.500 బోనస్ కూడా ఆగదని అన్నారు. రైతులకు ఎకరానికి రూ.12 వేల పెట్టుబడి సాయంతో పాటు, వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, రైతును రాజు చేసే వరకు విశ్రమించబోమని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి రైతుకూ అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.






