- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్వాడీ కేంద్రాలకు రూ.156 కోట్లు విడుదల..
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు శుభవార్త. పోషకాహార పథకం (ఎస్ఎన్‌పీ) కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ భారీగా నిధులు విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు శుభవార్త. పోషకాహార పథకం (ఎస్ఎన్‌పీ) కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ భారీగా నిధులు విడుదల చేసింది. జిల్లాల వారీగా వస్తువులు, కూరగాయలు, గ్యాస్ సరఫరా, ఇంటి అద్దెల వంటి వివిధ ఖర్చుల నిమిత్తం మొత్తం రూ.156 కోట్లను విడుదల చేసినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ వర్గాలు తెలిపాయి. నిధులు విడుదలైన నేపథ్యంలో, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖర్చులకు సంబంధించిన అన్ని బిల్లులను వెంటనే, అంటే రాబోయే రెండు రోజుల్లోపు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలని అన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులను (డీడబ్ల్యూఓ) ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయడానికే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధుల విడుదల అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు.






