- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RS Praveen Kumar: మంత్రి ఉత్తమ్ అలర్ట్‌గా ఉండాలి.. ఆయన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రాణభయం ఉన్నదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్(BRS) నాయకుల ఫోన్లతో పాటుగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఇతర నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భయానక పరిస్థితిలు నెలకొన్నాయని అన్నారు. రాజ్యాంగ హక్కులు కాపాడాల్సిన పోలీసులు, సీఎం రేవంత్ రెడ్డికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. గాంధీ భవన్ నుంచి ఆదేశాలు వచ్చాకే కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సోదరులు(CM Revanth Reddy's brothers) రాజ్యాంగయోతర శక్తులుగా మారుతున్నారని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాక, కొడంగల్ నుంచి కోదాడ దాక బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హోంమంత్రిగా(Home Minister), ముఖ్యమంత్రిగా ఉండటం బాధాకరమైన విషయమని తీవ్ర విమర్శలు చేశారు. ఇది తెలంగాణ ప్రజల దురదృష్టమని అన్నారు. ప్రజలు, రైతుల పక్షాన పోరాడుతున్న హరీష్ రావు(Harish Rao)పైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ(Congress party)ని ఉతికి ఆరేస్తామని హరీష్ రావు ప్రకటన చేయగానే అరెస్టులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
గత 25 రోజులుగా పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)ని జైల్లో పెట్టారు.. ఆయన్ను కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు దూరం చేశారని అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు హాస్యాస్పదమని తెలిపారు. కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని నాతో అనేకసార్లు చెప్పారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ అనుచరులు చంపుతారని నాతో అనేకసార్లు చెప్పారని అన్నారు. కౌశిక్ రెడ్డిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కౌశిక్ రెడ్డి ఫిర్యాదు తీసుకోకపోగా.. తననే అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తుందని అన్నారు. అరెస్ట్ చేసిన హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






