- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RS Praveen Kumar: ‘నేను కూడా ఐపీఎస్ అధికారిగా పని చేశాను.. ఆ విషయం నాక్కూడా తెలుసు’
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కుట్రపూరితంగానే చక్రధర్ గౌడ్ చేత కేసు పెట్టించారని ఆరోపించారు. అధికారులను పావులుగా వాడుకుని హరీష్ రావును ఎంతగా వేధించినా ప్రజల పక్షానే ఉంటారని అన్నారు. హరీష్ రావు ఏడు సార్లు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కోవిడ్ సమయంలో వైద్యారోగ్య మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. రేవంత్ రెడ్డి లాగా ఓటుకు నోటు కేసులో పాలుపంచుకోలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక కేసులో హరీష్ రావు(Harish Rao)ను ఇరికించి.. ప్రతీకారం తీర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని హామీలపై ప్రశ్నిస్తున్నందుకే హరీష్ రావుపై కక్ష గట్టారని అన్నారు.
పొలీసు ఉన్నతాధికారులు రేవంత్ అడుగులకు మడుగులొత్తుతున్నారు. పంజాగుట్ట కేసు(Panjagutta Case)లో హరీష్ రావు దగ్గర కేవలం మూడు నెలలు పనిచేసిన వంశీని డీసీపీ చేసిన టార్చర్ అంతా ఇంతా కాదు.. హరీష్ రావు పేరు చెప్పాలని లేదంటే చంపేస్తామని డీసీపీ విజయ్ కుమార్(DCP Vijay Kumar) బెదిరించారు.. నేను కూడా ఐపీఎస్ అధికారిగా పని చేశాను.. ఒత్తిడి ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు.. అంత మాత్రానా అమాయకులను టార్చర్ చేస్తారా? అని మండిపడ్డారు. దానికంటే ఒత్తిడికి తలొగ్గలేమని చెప్పి విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఉద్యోగాలను వదిలివేయడం మంచిదని హితవు పలికారు. హరీష్ రావుపై కేసు పెట్టిన చక్రధర్(Chakradhar Goud)పై కూడా రకరకాల కేసులు ఉన్నాయి.. లైంగికదాడి వంటి తీవ్ర నేరారోపణలను చక్రధర్ ఎదుర్కొంటున్నాడని అన్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని 1900 మందిని చక్రధర్ మోసం చేశారు.. ఆ కేసు ఇంకా నడుస్తోందని తెలిపారు. అంతేకాదు.. ఒక కిడ్నాప్ కేసు(Kidnapping Case) కూడా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఇంకా బతికుంది. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు. పొలీసు అధికారులు రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలు పాటించవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని రిక్వెస్ట్ చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొనే దమ్ము తమ పార్టీ నేతలకు ఉందని అన్నారు.






