- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
R.S. PRAVEEN KUMAR: మళ్లీ సిర్పూర్ నుండే పోటీ చేస్తా.. ఆర్ఎస్పీ కీలక వ్యాఖ్యలు
మళ్లీ సిర్పూర్ నుండే బరిలోకి దిగుతానంటూ బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ టీవీ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కోనేరు కోనప్ప పార్టీలోకి వస్తానంటే తాను వ్యతిరేకించలేదని అన్నారు. పార్టీలోకి చాలా మంది వస్తుంటారు.. పోతుంటారని పార్టీ అవసరాలను బట్టి అది జరుగుతుందన్నారు. పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యం అని తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: మళ్లీ సిర్పూర్ నుండే బరిలోకి దిగుతానంటూ బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ టీవీ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కోనేరు కోనప్ప పార్టీలోకి వస్తానంటే తాను వ్యతిరేకించలేదని అన్నారు. పార్టీలోకి చాలా మంది వస్తుంటారు.. పోతుంటారని పార్టీ అవసరాలను బట్టి అది జరుగుతుందన్నారు. పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యం అని తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. కానీ తనను సిర్పూర్ ప్రజలు తమ ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నారని ఆ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. కోనప్ప తన సీటును తీసుకోడని ఆయనకు అనుచరులు ఉంటే తనను 45వేల మంది అభిమానించారని చెప్పారు. సిర్పూర్ నుండి పోటీ చేయాలనే తన మనసు చెబుతోందని, సిర్పూర్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు.
పార్టీని ఒప్పిస్తాననే నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉందని అప్పుడు ఏం జరుగుతుందో చూడాలన్నారు. బీఆర్ఎస్‌లో తాను అసంతృప్తిగా లేనని, పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఇదిలా ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుండి బీఎస్పీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తరవాత ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అదే నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కోనప్ప పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఎన్నికల తరవాత ఆర్‌ఎస్పీ బీఆర్ఎస్‌లో చేరడంతో తన ఓటమికి కారణమైన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని కోనప్ప గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇటీవల తిరిగి ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ బీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కుంతుంది అనేదానిపై చర్చ మొదలైంది. ఇప్పడు ఆర్‌ఎస్పీ సిర్పూర్ టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది.






