- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు నెలలైనా గురుకుల కళాశాలలకు అందని పాఠ్యపుస్తకాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన చేతిలో పెట్టుకుని విద్యార్దులకు నాణ్యమైన చదువులు అందకుండా కుట్రలు చేస్తున్నాడని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- సీఎం రేవంత్ వద్ద విద్యాశాఖ ఉండటంతో ఈ దుస్థితి : బీఆర్ఎస్నేత ఆర్ఎస్ప్రవీణ్కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన చేతిలో పెట్టుకుని విద్యార్దులకు నాణ్యమైన చదువులు అందకుండా కుట్రలు చేస్తున్నాడని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఎక్స్వేదిక స్పందిస్తూ తెలంగాణలో విద్యా వ్యవస్థ అథః పాతాళంలోకి పోతుందని, సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి మూడు నెలలైనా చాలా కాలేజీల్లో ఇప్పటికీ పుస్తకాలు రాలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇందుకోసమే విద్యాశాఖను తమరి దగ్గరనే పెట్టుకున్నారా, మీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడం లేదని విమర్శించారు. అగాథంలోకి తెలంగాణ పోతుందని ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మేల్కొని విద్యాశాఖకు మంత్రిని పెట్టి పేదలకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని కోరారు.






