- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ లాంటి పిరికిపందను ఎక్కడా చూడలేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మంత్రి కేటీఆర్‌పై బీఎస్పీ చీఫ్ ఆర్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా పలువురు బీఎస్పీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్‌పై బీఎస్పీ చీఫ్ ఆర్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా పలువురు బీఎస్పీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ చర్యను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు. ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీ, మంత్రి కేటీఆర్ లాంటి పిరికిపందలను తానెక్కడా చూడలెదన్నారు. మంత్రి పర్యటనలుంటే రాత్రికి రాత్రి బీఎస్పీ కార్యకర్తలను అరెస్ట్ చేసుడేందని ప్రశ్నించారు. తామెక్కడా మంత్రి సభలను అడ్డుకోలేదని, అలాంటి దుష్ట సంప్రదాయం తమకు లేదని ఎద్దేవా చేశారు. బీఎస్పీ కార్యకర్తల అరెస్ట్‌పై కోర్టుకెళ్తామని ఆర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
@KTRBRS @TSwithKCR లంత పిరికిపందలను నేనెక్కడా చూడలే!
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) May 5, 2023
జిల్లాలలో మీ పర్యటనలుంటే రాత్రికి రాత్రి బీయస్పీ కార్యకర్తలను అరెస్టు చేసుడేంది? మేమెక్కడా మీ సభలను అడ్డుకోవడం లేదు, అయినా మీ లాంటి దుష్ట సంప్రదాయం మాకు లేదు. ఈ విషయంలో కోర్టుకు పోతాం. #KTRtheCoward pic.twitter.com/2cMeYS7v3X






