- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dimda farmers: దిందా పోడు రైతుల అరెస్ట్ పిరికిపంద చర్య.. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ కీలక వ్యాఖ్యలు
పోడు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పోడు భూములకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి దిందా గ్రామం నుంచి హైదరాబాద్‌కు 400 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్తున్న (Podu farmers) పోడు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఖండించారు. (Dimda farmers) రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి మూడు బస్సుల్లో రైతులను తిరిగి ఆసిఫాబాద్‌కు తరలించడం దారుణమైన చర్యగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం కాగజ్‌నగర్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ పేరు చెప్పి రైతులకు బేడీలు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. లగచర్లలో, గద్వాలలో రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం నేడు దిందా రైతులను అరెస్టు చేసిందని మండిపడ్డారు.
గతంలో కేసీఆర్ పాలనలో రైతులు స్వర్ణయుగం చూసారని, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారంలోకి వచ్చాక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో 550 మంది రైతులు మరణించారని గుర్తు చేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో రైతుల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ, రాజ్యాంగం పట్టుకొని జీవించే హక్కు ఆర్టికల్ 21 గురించి మాట్లాడుతున్నారని, కానీ తెలంగాణలో రైతులు తమ బాధలు చెప్పుకుందామంటే అరెస్ట్ చేస్తున్నారని వాపోయారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, దిందా గ్రామ బీసీలు భూముల గురించి అడిగితే మాత్రం అరెస్ట్ చేయడం, బీసీలకు మోసం చేయడం కాదా? అని నిలదీశారు. బీజేపీ ఎమ్మెల్యే వారి ఓట్లతో గెలిచి, ఈ రోజు వారి గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర అటవీ శాఖ మంత్రికి ఈ విషయాన్ని ఎందుకు చేరవేయడం లేదని నిలదీశారు. వెంటనే ప్రభుత్వం రైతులను విడుదల చేయాలని, వారికి పోడు భూములపై హక్కులు కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






