ఫార్ములా ఈ కార్ రేస్‌పై మళ్లీ లీకులు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-02-15 15:48:23  IST  )

ఫార్ములా ఈ-కార్ రేస్‌పై మళ్లీ లీకులు ఇస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఆరోపించారు.

ఫార్ములా ఈ కార్ రేస్‌పై మళ్లీ లీకులు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫార్ములా ఈ-కార్ రేస్‌పై మళ్లీ లీకులు ఇస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఆరోపించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 2020 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు మున్సిపాలిటీలు వచ్చాయని.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 30 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని తెలిపారు. సీఎం డబ్బులు మూటలు పంపినా కాంగ్రెస్ 51 శాతం వార్డులు మాత్రమే గెలిచిందన్నారు. 36 మున్సిపాలిటీల్లో హంగ్‌లో ఉన్నదని.. ఏమైనా చేసి ఆ మున్సిపాలిటీలను సైతం కైవసం చేసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్‌కు మెజారిటీ వచ్చిందని.. వారు క్యాంపులో ఉంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కనుక్కొని పోలీసులను పంపారని ఆరోపించారు.

కొన్నిచోట్ల మఫ్టీలో పోలీసులను క్యాంపులకు పంపించారని తెలిపారు. చేర్యాలలో భార్య బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేస్తే భర్తను సస్పెండ్ చేశారని.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల కుటుంబీకులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారని.. వారిని ఏమైనా బీఆర్ఎస్ హయాంలో సస్పెండ్ చేశారా అని ప్రశ్నించారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ దండే విఠల్ ఓటు వేయకపోయినా అతనికి అక్కడ ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. కొన్నిచోట్ల కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ ఇంటికి ఎన్నిసార్లు నోటీసులు అంటించినా బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని అన్నారు. జగ్గారెడ్డి, ధర్మపురి అరవింద్‌ను ఎందుకు ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.

Next Story