- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సాస్కి’కి రూ. 2వేల కోట్ల ప్రతిపాదనలు.. వచ్చే ఏడాది నిధులు ?
పట్టణాల్లో సంస్కరణలను అమలు చేసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టణాల్లో సంస్కరణలను అమలు చేసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్-2025-26’ (సాస్కీ) కింద రూ.2 వేల కోట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. సంస్కరణల అమలుకు సంబంధించి ప్రతిపాదనలను నోడల్ ఏజెన్సీగా ఉన్న డీటీసీపీ ఇప్పటికే వివిధ శాఖల నుంచి సేకరించింది. అన్ని అంశాలను పరిశీలించి ఫైనల్ రిపోర్టు తయారు చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నది.
డీటీసీపీకే బాధ్యతలు
టౌన్ ప్లానింగ్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్, ట్రాన్సిట్ ఓరియంటెండ్ డెవలప్ మెంట్ (టీఓడీ), స్పాంజి సిటీల ఏర్పాటు, అర్బన్ ఫారెస్ట్, నీటి వనరుల సంరక్షణ, గ్రీన్ బిల్డింగ్స్ వంటి వాటిని అమలుచేయడానికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించిన వర్క్ షాపును ఇప్పటికే నిర్వహించారు. ఈ ప్రతిపాదనలు తయారుచేయడం మొదలుకుని ఫైనల్ చేసే బాధ్యతలను డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ)కి అప్పగించారు. అయితే వీటిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఆదాయం పెంచుకునే సంస్కరణలు కీలకంగా ఉన్నాయి.
జనవరిలోనే నిధులు..
డీటీసీపీ ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను క్రోడీకరించింది. కేంద్ర ప్రభుత్వం అడిగిన ఫార్మాట్ లో ప్రతిపాదనలను పంపించడానికి కసరత్తు పూర్తి చేసింది. ఈనెలాఖరులోగా ఈ ప్రతిపాదనలను కేంద్రప్రభుత్వానికి పంపిస్తే వాటిని పరిశీలించిన అనంతరం.. జనవరి మొదటి వారంలో సుమారు రూ.2కోట్ల నిధులను మంజూరు చేసే అవకాశముంది.






