- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం జిల్లాకు రూ.18 కోట్లు.. పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ
ఖమ్మం జిల్లాలోని పార్కు, ఖిల్లా రోప్ వే డవలప్‌మెంట్ కోసం జీఓ నెం.51 కింద టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.18కోట్లు మంజూరు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి టీకే.శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం జిల్లాలోని పార్కు, ఖిల్లా రోప్ వే డవలప్ మెంట్ కోసం జీఓ నెం.51 కింద టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.18కోట్లు మంజూరు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి టీకే.శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల అర్బన్ పార్క్ డవలప్ మెంట్, నిర్వహణకు రూ.3కోట్లు మంజూరు చేశారు. ఈ పనులను ఖమ్మం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. దీంతోపాటు ఖమ్మం జిల్లా టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఖిల్లా నుంచి రోప్ వే డవలప్ మెంట్, ఇతర అభివృద్ది కార్యక్రమాల కోసం రూ.15కోట్లు మంజూరు చేశారు. ఈ పనులకు సంబంధించి వెంటనే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నల్గొండ యూజీడీ పనులకు రూ.2.41కోట్లు..
నల్గొండ మున్సిపాలిటీలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.2.41కోట్లు చెల్లించడానికి అనుమతిస్తూ పురపాలకశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. దీకి సంబంధించి పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.






