Online App : ఆన్ లైన్ యాప్ తో రూ.15కోట్లు హంఫట్

by Y. Venkata Narasimha Reddy |

ఆన్ లైన్..సైబర్ మోసాలు నిత్యం ఎక్కడో అక్కడ వెలుగు చూస్తున్నప్పటికి ప్రజలు వాటి వలలో పడి మోసపోవడం ఆగడం లేదు. మనిషి ఆశనే ఎరగా వేసి వారి డబ్బులనే కొల్లగొట్టే ఆన్ లైన్ మోసగాళ్ల బారిన పడి రూ.15కోట్లు పోగొట్టుకున్న ఘటన జనగామ జిల్లా(Janagaon District)లలో వెలుగుచూసింది.

Online App : ఆన్ లైన్ యాప్ తో రూ.15కోట్లు హంఫట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆన్ లైన్..సైబర్ మోసాలు నిత్యం ఎక్కడో అక్కడ వెలుగు చూస్తున్నప్పటికి ప్రజలు వాటి వలలో పడి మోసపోవడం ఆగడం లేదు. మనిషి ఆశనే ఎరగా వేసి వారి డబ్బులనే కొల్లగొట్టే ఆన్ లైన్ మోసగాళ్ల బారిన పడి రూ.15కోట్లు పోగొట్టుకున్న ఘటన జనగామ జిల్లా(Janagaon District)లలో వెలుగుచూసింది. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలంలో కొందరు ఏజెంట్లు లాభాలు వస్తాయని అధిక లాభాల ఆశ చూపించడంతో కోస్టా(Costa) అనే ఆన్‌లైన్ యాప్‌(An Online App)లో బాధితలు ఒక్కోక్కరు రూ.లక్ష పెట్టుబడు(Investments)లు పెట్టారు.

మొదటిగా కొందరు అందులో డబ్బులు పెట్టారు. లాభాలు రావడంతో చైన్ పద్ధతిలో మరికొందరిని అందులో చేర్చారు. అలా దాదాపు రెండు వేల మంది రూ.15కోట్ల మేరకు ఈ యాప్‌లో పెట్టుబడులు పెట్టారు. ఆకస్మాత్తుగా యాప్‌లో డబ్బుల విత్‌డ్రా ఆప్షన్‌ తొలగించారు. దీంతో తాము మోసపోయినట్లు బాధితులు ఆలస్యంగా గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story