- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.1,000 కోట్ల భూ కుంభకోణం.. బట్టబయలు చేసిన హరీశ్‌రావు!
శంషాబాద్ మండలం పెద్దషాపూర్‌లో రూ.1,000 కోట్ల భారీ భూ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: నగర శివారులోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ((RGIA) పరిసర ప్రాంతాల్లో 180 ఎకరాల భారీ భూ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తెలిపారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పెద్దషాపూర్ (Peddashapur) పరిధిలో సుమారు రూ.1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతలకు సహకరించారని అన్నారు.
అయితే, ఈ 180 ఎకరాల భూమిపై గతంలోనే సమగ్ర విచారణ జరిగిందని.. అది సర్కారు భూమేనని స్పష్టం చేస్తూ ఆర్డీవో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కానీ, ఆర్డీవో ఇచ్చిన ఆ అఫీషియల్ ఆర్డర్‌ను పూర్తిగా ధిక్కరిస్తూ.. స్థానిక ఎమ్మార్వో ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపించారు. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న ల్యాండ్‌ను, అది పట్టా భూమి అని చెప్పడానికి ఒక తహసీల్దార్‌కు ఎక్కడి నుంచి అధికారాలు వచ్చాయని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే ఇలా కుంభకోణాలకు తెరలేపడంపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన తహసీల్దార్‌తో పాటు దీని వెనుక ఉన్న లబ్ధిదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.






