HYD: ట్రిపులార్ రైతుల సంచలన నిర్ణయం.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోటీ!

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-15 08:17:20  IST  )

ట్రిపులార్ రైతులు(RRR Farmers) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

HYD: ట్రిపులార్ రైతుల సంచలన నిర్ణయం.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రిపులార్ రైతులు(RRR Farmers) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)ల బరిలో నిలవాలని ఫిక్స్ అయ్యారు. ఈనెల 20వ తేదీలోపు ప్రభుత్వం స్పందించి.. తమకు రావాల్సిన పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. లేకపోతే 21వ తేదీన 300 మంది రైతులు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. కాగా, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అన్ని రకాల అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నది. ఈ క్రమంలోనే భూసేకరణకు శ్రీకారం చుట్టింది. అయితే.. పరిహారం ఇచ్చే విషయంలో మాత్రం ఆలస్యం జరుగుతోంది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

Next Story