Rohit Sharma: వన్డేలకు గుడ్‌బై చెప్పనున్న రోహిత్..! క్లారిటీ ఇచ్చిన శుభ్‌మన్ గిల్

by Kema Shiva Kumar |

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో భారత జట్టు (Team India) అత్యద్భుత ప్రదర్శన చేసింది.

Rohit Sharma: వన్డేలకు గుడ్‌బై చెప్పనున్న రోహిత్..! క్లారిటీ ఇచ్చిన శుభ్‌మన్ గిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో భారత్ (India) అత్యద్భుత ప్రదర్శన చేసింది. ఓటమి అనేదే లేకుండా దుబాయ్ (Dubai) వేదికగా ఫైనల్‌‌లో నేడు న్యూజిలాండ్‌ (New Zealand)తో తలపడబోతోంది. ఈ క్రమంలోనే ఓ వార్త టీమిండియా (Team India) ఫాన్స్‌ను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే కెప్టెన్ రోహిత్‌ శర్మ (Rohit Sharma) వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తారని సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ డిస్కషన్ రాలేదు.. గిల్

ఈ క్రమంలోనే భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించబోతున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు. రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు మాట్లాడుతూ.. ఫైనల్‌ (Final)లో భారత జట్టు విజయం సాధించడం పక్కా అని అన్నారు. రిటైర్మెంట్ల విషయంపై డ్రెస్సింగ్ రూమ్‌ (Dressing Room)లో ఎలాంటి డిస్కషన్ జరగలేదని.. అవన్ని వదంతులేనని క్లారిటీ ఇచ్చారు. ప్రపంచ క్రికెట్‌లో ఉత్తమ డ్యాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అని కితాబిచ్చాడు. టీమిండియా అటు బ్యాటింగ్.. బౌలింగ్‌తో పాటు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉందని అన్నారు. ఫైనల్ మ్యాచ్ కోసం పకడ్బందీగా సన్నద్ధమవుతున్నామని తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో కాస్త ప్రెషర్ ఉంటుందని.. ఈ సారి ఆ ఒత్తిడిని అధిగమించి ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)ని కైవసం చేసుకుంటామని శుభ్‌మన్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story