- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు.. మరమ్మతులకు అంచనా ఖర్చు రూ.720 కోట్లు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రహదారులు దెబ్బతిన్నాయి, సీడీ (క్రాస్ డ్రైనేజీ), కాజ్ వే, మైనర్ బ్రిడ్జీలు, కల్వర్టులు కోతకు గురయ్యాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రహదారులు దెబ్బతిన్నాయి, సీడీ (క్రాస్ డ్రైనేజీ), కాజ్ వే, మైనర్ బ్రిడ్జీలు, కల్వర్టులు కోతకు గురయ్యాయి. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో దెబ్బతిన్న రోడ్లు, సీడీ వర్క్స్, బ్రిడ్జీలకు తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత పనులు చేపట్టేందుకు రోడ్డు భవనాల శాఖ సిద్ధమవుతున్నది. ఇంజినీరింగ్ అధికారులు అందుకు సంబంధించిన అంచనా నివేదికలను రూపొందించారు. త్వరలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో సమావేశమై చేపట్టాల్సిన పనులను వివరించేందుకు సిద్ధమవుతున్నారు. వాటికి సంబంధించిన నిధుల మంజూరుకు అనుమతులు తీసుకొని పనులు చేపట్టాలని భావిస్తున్నారు.
వెయ్యి కి.మీ పైగా..
హైదరాబాద్ మినహాయించి ఉమ్మడి 9 జిల్లాల పరిధిలో 961 చోట్ల రోడ్లు, సీడీ వర్క్స్, బ్రిడ్జీలు, కాజ్ వే, మైనర్ బ్రిడ్జీలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. వెయ్యి కిలోమీటర్లకు పైగా రహదారులు ధ్వంసమైనట్టు ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. ఎక్కడెక్కడ ఎన్ని కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి? ఎన్ని కల్వర్టులు కూలాయి? ఎన్ని చోట్ల సిమెంట్ వర్కులు వరద ఉదృతికి కొట్టుకుపోయాయి? బ్రిడ్జీలకు ఏ మేరకు నష్టం వాటిల్లిందో సమగ్రంగా నివేదికలు తయారు చేశారు ఎన్ని రోజుల్లో పూర్తి చేయనున్నారో కూడాఅందులో వివరించారు. వీటిలో కొన్నింటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు రూ.64.88 కోట్లు, శాశ్వత రిపేర్స్ కు రూ.720.72 కోట్ల అంచనాలతో నివేదికలో పొందుపరిచారు. అంచనాల ప్రకారం నిధులు మంజూరు చేస్తే.. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తాత్కాలిక మరమ్మతులకు రూ.64.88 కోట్లు
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రోడ్లకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పాడ్డాయి. వీటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు రూ.64.88 కోట్ల అంచనాలతో నివేదికలు రూపొందించారు. తాత్కాలిక మరమ్మతుల్లో మెదక్, ఖమ్మం మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలో రోడ్లకు ఏర్పడిన గుంతలను కంకర, తారుతో పూడ్చేందుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నివేదికలో పొందుపర్చినట్లుత లిసింది. అంతే కాకుండా బ్రిడ్జీలపై రంధ్రాలు ఏర్పడిన చోట్ల కూడా తాత్కాలిక మరమ్మతులు అవసరమని పేర్కొన్నారు.






