రేడియల్ కనెక్టివిటీ.. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్‌కు రోడ్లు

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ నగర భవిష్యత్తు విస్తరణకు కీలకమైన మౌలిక వసతి ప్రణాళికగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్ల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

రేడియల్ కనెక్టివిటీ.. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్‌కు రోడ్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగర భవిష్యత్తు విస్తరణకు కీలకమైన మౌలిక వసతి ప్రణాళికగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్ల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరాన్ని ఓఆర్ఆర్ దాటి జిల్లాలకు విస్తరించేందుకు నిర్మించ తలపెట్టిన ఆర్ఆర్ఆర్‌కు మంచి కనెక్టివిటీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మిగతా ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుందని సర్కారు భావిస్తోంది. ఈ రేడియల్ రోడ్ల ద్వారా నగరం నుంచి బయటకు వెళ్లే రవాణా మరింత సులభమవుతుంది. అలాగే భవిష్యత్‌లో ఏర్పడే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, నివాస ప్రాంతాలు, పరిశ్రమల క్లస్టర్లు, ఐటీ, లాజిస్టిక్స్ వంటి థీమాటిక్ హబ్‌లకు నేరుగా కనెక్టివిటీ కల్పించనుంది. ఫ్యూచర్ సిటీకి ఇందులో భాగంగానే రతన్ టాటా రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది.

మహానగరం చుట్టూ రేడియల్ రోడ్లు..

మహానగరం చుట్టూ 158 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్ భవిష్యత్తులో రానున్న ఆర్ఆర్ఆర్‌ అనుసంధానం కోసం హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగరం నుంచి ఓఆర్‌ఆర్‌ను పూర్తిగా అనుసంధానం చేయనున్నారు. రానున్న రోజుల్లో ఈ రెండు కీలక రహదారుల మధ్యే అభివృద్ధి ప్రాజెక్టులు రానుండటంతో మౌలిక వసతులు కల్పించాలని హెచ్‌ఎండీఏ యోచిస్తోంది. ఇందులో భాగంగానే తొలుత రోడ్డు నెట్‌వర్క్‌పై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఓఆర్ఆర్ మీదుగా 11 వరకు రాష్ట్ర, జాతీయ రహదారులు వెళుతున్నాయి. ఇవి ఓఆర్‌ఆర్, ఆర్ఆర్ఆర్ దాటి వెళ్లనున్నాయి. వీటితో పాటు ఓఆర్ఆర్ చుట్టూ ప్రతి 7-8 కి.మీ మధ్య 10 రేడియల్‌ రోడ్డు నిర్మించాలనేది ప్లాన్. వీటిని ఆర్ఆర్ఆర్‌తో అనుసంధానం చేస్తారు.

10 కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు ..

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 10 కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఇవి మెట్రో కారిడార్‌ల వెంట, వాటికి అనుసంధానంగా ఉండేలా రూపొందిస్తున్నారు. దీనివల్ల రోడ్డు, రైలు రవాణా మధ్య మెరుగైన సమన్వయం ఏర్పడుతుంది. ఈ రోడ్ల ద్వారా హైదరాబాద్‌కు చుట్టూ ఉన్న జిల్లాల నుంచి నగరంలోకి చేరుకునే సమయం తగ్గడమే కాకుండా, కొత్త ప్రాంతాల్లో పెట్టుబడులు, రియల్ ఎస్టేట్, పరిశ్రమల అభివృద్ధికి గణనీయమైన ప్రోత్సాహం లభించనుంది. శంషాబాద్‌ విమానాశ్రయం దగ్గర్లో వర్దమాన్‌ కళాశాల సమీపం నుంచి లగచర్ల వరకు 81 కి.మీ వరకు ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్ఆర్ఆర్ దాటుకుని రహదారి నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించి భూ సేకరణ చేపట్టడానికి తాజాగా ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ రేడియల్‌ రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మించనున్నారు. త్వరలో పనులు మొదలుపెట్టేలే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

కేంద్రానికి రూ.45వేల కోట్ల నిధులకు విజ్ఞప్తి..

ఈ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వ సహాయం కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి రూ.45 వేల కోట్ల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ నిధులు లభిస్తే రేడియల్ రోడ్ల నిర్మాణం వేగంగా పూర్తై, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రేడియల్ రోడ్లకు నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు.

నగరానికి కొత్త వృద్ధి మార్గాలు..

ఓఆర్ఆర్- ఆర్ఆర్ఆర్ మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణంతో హైదరాబాద్ ఇకపై ఒకే దిశలో కాకుండా అన్ని వైపులా విస్తరించే అవకాశం ఏర్పడుతుంది. ట్రాఫిక్ భారం తగ్గడం, ప్రయాణ సమయం కుదించడం, కొత్త ఆర్థిక కార్యకలాపాలకు దారితీయడం వంటి ప్రయోజనాలు ఈ ప్రాజెక్టుతో సాధ్యమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి రేడియల్ రోడ్లు హైదరాబాద్‌ను మరింత సమర్థవంతమైన, భవిష్యత్‌కు సిద్ధమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా మార్చే కీలక మౌలిక సదుపాయాలుగా నిలవనున్నాయి.

ప్రారంభమైన రతన్ టాటా రోడ్డు.. (బాక్స్)

ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్ఆర్ఆర్‌ వరకు అనుసంధానం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రావిర్యాల (ఎగ్జిట్‌ 13) నుంచి ఆమనగల్లు వరకు 41 కిలోమీటర్లకు ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి పనులు మొదలయ్యాయి. హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఓఆర్ఆర్ నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ నిర్మించ తలపెట్టిన ఈ రహదారి.. ప్రస్తుత నాగార్జునసాగర్, శ్రీశైలం హైవేలపై పెరుగుతున్న రద్దీ, ప్రమాదాలను తగ్గించడంలో సహాయ పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఫేజ్-1లో భాగంగా ఓఆర్​ఆర్- రావిర్యాల నుంచి మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్ వరకు 19.20 కి.మీ పనులు ప్రారంభం కాగా.. ఫేజ్-2లో భాగంగా మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్ నుంచి ఆర్ఆర్ఆర్- ఆమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గల్ వరకు 22.30 కి.మీ రోడ్డు కోసం పరిపాలన అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 41.50 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ. 4,030 కోట్లు, భూసేకరణకు రూ. 591 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు.

Next Story