- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్ హిప్నాసిస్.. కళ్లు తెరిచే ఉంటాయి.. కానీ మెదడు స్పందించదు: రోడ్డు ప్రమాదాలపై రాచకొండ పోలీస్ ఆసక్తికర ట్వీట్
ప్రతి ఏటా నమోదయ్యే మరణాల్లో 40 శాతం రోడ్డు ప్రమాదాలేని పలు నివేదికలు చెబుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతి ఏటా నమోదయ్యే మరణాల్లో 40 శాతం (Road accidents) రోడ్డు ప్రమాదాలేని పలు నివేదికలు చెబుతున్నాయి. వాహనాలు కండీషన్‌లో లేకపోవడం, అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహన లోపంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారణ కొరకు రహదారి భద్రతపై విస్తృత అవగాహన పెంపొందించాలనే క్రమంలో (Rachakonda Police) రాచకొండ పోలీస్ ఓ వినూత్న అవగాహన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంది. ప్రమాదాన్ని ముందే గుర్తించాలని, వాహనాదారులు సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నప్పుడు.. ఒక కనిపించని ప్రమాదం మీకు తెలియకుండానే దగ్గర అవుతోందని హెచ్చరించింది. దాని పేరు రోడ్ హిప్నాసిస్ (Road hypnosis) అని, రోడ్డుపైకి వచ్చిన తర్వాత దాదాపు రెండున్నర గంటల తర్వాత రొడ్ హిప్నాసిస్ ప్రారంభం అవుతుందని తెలిపింది. కళ్లు తెరిచే ఉంటాయి.. కానీ మెదడు స్పందించదని సూచించింది.
అప్పుడు మీ ముందు ఉన్న వాహనం లేదా ట్రక్ లాంటి వాటిని వెనుక భాగంలో ఢీ కొనడం ఇదే మొదటి కారణమని పేర్కొంది. రోడ్ హిప్నాసిస్‌లో ఉన్న డ్రైవర్ గడిచిన 15 నిమిషాల నుంచి ఢీ కొట్టిన క్షణం వరకు ఏమి గుర్తు కూడా ఉండదని వెల్లడించింది. అతడు నడుపుతున్న వాహనం వేగం, అతని ముందు ఉన్న వాహనం వేగాన్ని విశ్లేశించలేడని పేర్కొంది. రోడ్ హిప్నాసిస్ ఎక్కువగా రాత్రి సమయంలో జరుగుతుందని, ప్రయాణికులు కూడా నిద్రపోతున్నట్లు అయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఇది చాలా ప్రమాదకరమని, ప్రాణాంతకంగా ఢీకొనడం జరగవచ్చని హెచ్చరించింది. అటువంటి సందర్భంలో డ్రైవర్లు హవానాన్ని ఆపి విశ్రాంతి తీసుకోవాలని, ప్రతి రెండు గంటలకు కారు ఆపి ఐదు నుంచి ఆరు నిమిషాలు నడవాలని సూచించింది. డ్రైవర్ చేసేటప్పుడు ఇతర వాహనాలను గమనించడం చాలా ముఖ్యమని తెలిపింది. రోడ్ హిప్నాసిస్ గురించి, ప్రమాదాలు ఎప్పుడు, ఎందుకు జరుగుతాయో, వాటి నుంచి తప్పించుకునే మార్గాలు తెలుసుకోవాలని వాహనదారులకు రాచకొండ పోలీస్ సూచించింది.






