PV Expressway: అత్తాపూర్ ఫ్లైఓవర్ మీద పల్టీ కొట్టిన కారు.. ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం

by Ramesh Naini |

ఇటీవల కాలంలో నగరంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అతివేగం కారణంగా చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు.

PV Expressway: అత్తాపూర్ ఫ్లైఓవర్ మీద పల్టీ కొట్టిన కారు.. ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో నగరంలో రోడ్డు ప్రమాదాలు (Road accident) ఎక్కువగా జరుగుతున్నాయి. అతివేగం కారణంగా చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే (PV Narasimha Rao Expressway) పై రోడ్డు ప్రమాదం సంభవించింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్లే దారిలో పిల్లర్ నెంబర్ 280 వద్ద (Two cars collided) రెండు కార్లు ఢీ కొనగా.. ఓ కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పల్టీ కొట్టిన కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకుని అక్కడికి వచ్చిన పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఆదివారం అర్ధరాత్రి మియాపూర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 636 వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నదమ్ములు హైదర్ షరీఫ్(68), రెహమాన్ షరీఫ్(65) బైక్ స్కిడ్ అవడంతో అదుపు తప్పి కిందపడ్డారు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వారి మీద నుంచి దూసుకెళ్లడంతో హైదర్ షరీఫ్ మృతిచెందగా రెహమాన్ షరీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రెహమాన్ షరీఫ్‌ను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఇక, ఈ ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story