- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ప్యాసింజర్‌లతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్యాసింజర్‌లతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మేకలగండి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయినట్లు తెలిసింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతులను ఆటో డ్రైవర్ పొచ్చన్న, అతని భార్య గంగు, కూతురు శైలజ, ఆమె చిన్నమ్మ సోంబాయిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






