- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
R.Krishnaiah: దొంగలు, నక్సలైట్ల తరహాలో అర్థరాత్రి అరెస్టు చేస్తారా?.. బీసీ నాయకుల అరెస్టుపై ఆర్.కృష్ణయ్య ఆగ్రహం
బీసీ ఉద్యమంపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆర్.కృష్ణయ్య ధ్వజమెత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నిన్న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ బంద్ (BC bandh) నేపథ్యంలో తొమ్మిది మంది బీసీ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంపై బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలు, నక్సలైట్లను అరెస్టు చేసినట్లుగా బీసీ నేతలను అర్ధరాత్రి అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రులు అరెస్టు చేయడం సరికాదన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆర్.కృష్ణయ్య.. నిన్నటి బంద్ సందర్భంగా చిన్న చిన్న సంఘటనలు జరిగాయని వీటిని ఆసరగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఉద్యమాన్ని అణిచివేయాలని కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున బంద్ జరిగిందని కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బీసీ నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేశారన్నారు. ముఖ్యమంత్రి జోక్యంతోనే ఈ అరెస్టులు జరిగాయని చెబుతున్నారని దీనిపై లోతుగా తెలుసుకుంటామన్నారు. చిన్న విషయాలకు కేసులు పెడితే బీసీ వ్యతిరేకత మూటకట్టుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రిని హెచ్చరించారు.






