- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిల్లర్లపై విధించిన 25 శాతం ఫెనాల్టీతో పాటు వడ్డీలను మాఫీ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ కొత్త విధానాలు,బకాయిల చెల్లింపుల ఆలస్యంతో బియ్యం నిల్వ సమస్యతో పాటు రవాణా ఖర్చులు పెరగడంతో మిల్లర్లు అనేక ఇబ్బందులకు గురైతున్నారని రాష్ట్ర మిల్లర్ల అసోసియేషన్ సంఘం అధ్యక్షులు పాడి గణపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
- రాష్ట్ర మిల్లర్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ కొత్త విధానాలు,బకాయిల చెల్లింపుల ఆలస్యంతో బియ్యం నిల్వ సమస్యతో పాటు రవాణా ఖర్చులు పెరగడంతో మిల్లర్లు అనేక ఇబ్బందులకు గురైతున్నారని రాష్ట్ర మిల్లర్ల అసోసియేషన్ సంఘం అధ్యక్షులు పాడి గణపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లపై విధించిన 25 శాతం పెనాల్టీతో పాటు వాటిపై విధించిన వడ్డీలను మాఫీ చేయాలని కోరారు. వరి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, రైస్ మిల్లర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ సీఎంఆర్చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఈ రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు లక్ష్యాన్ని పెట్టుకుని వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైస్ మిల్లర్లకు సదుపాయాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందన్నారు. రైతుల నుంచి వరి కొనుగోలు వేగం పెరగడంతో, మిల్లింగ్ సామర్థ్యంపై కూడా ఒత్తిడి పెరిగిందన్నారు. వరి కొనుగోలు ఆలస్యం జరిగితే రైతులతో పాటు మిల్లర్లపై కూడా ప్రభావం పడుతుందని, మిల్లర్ల సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కేబినెట్ మంత్రులు అంతా మిల్లర్ల సమస్యలు పరిష్కరించే దశగా మంత్రి వర్గంలో నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, నిల్వ సదుపాయాలు పెంచడంతో పాటు మిల్లర్లకు సబ్సిడీలు అందించాలన్నారు. సీఎంఆర్ విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిల్లర్ల సమస్యలను త్వరగా పరిష్కరించలన్నారు.






