- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RGUKT : మహబూబ్‌నగర్‌లో RGUKT కొత్త క్యాంపస్.. పరిపాలన అనుమతులు మంజూరు
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్(Mahabub Nagar)లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(RGUKT) కొత్త క్యాంపస్ ఏర్పాటుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ క్యాంపస్‌లో 2025-26 విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభం కానున్నాయి. మహబూబ్‌నగర్ క్యాంపస్‌లో ఈ ఏడాది నుంచి మూడు కోర్సులు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అవి: 1) ఇంటిగ్రేటెడ్ బీ.టెక్ ప్రోగ్రాం (6 సంవత్సరాలు) - ఇది రెండేళ్ల ప్రీ-యూనివర్సిటీ కోర్సు, నాలుగేళ్ల బీ.టెక్‌ను కలిపి ఉంటుంది. ఈ కోర్సు 10వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు.
2) ఎం.టెక్ (2 సంవత్సరాలు) - ఇంజనీరింగ్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కోర్సు, దీనికి GATE స్కోర్ ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది.
3) పీహెచ్‌డీ ప్రోగ్రామ్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇతర ఇంజనీరింగ్ రంగాల్లో పరిశోధన కోసం ఈ కోర్సు ప్రారంభిస్తారు.
ఈ క్యాంపస్‌లో అడ్మిషన్లు, ఫీజు వివరాలు, ఇతర సమాచారం త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో www.rgukt.ac.in అందుబాటులో ఉంటుంది. బాసర క్యాంపస్‌లో ఇప్పటికే ఈ కోర్సులు నడుస్తున్నాయి. ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో కూడా విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. కాగా RGUKT సాధారణంగా గ్రామీణ యువతకు ఉన్నత విద్య అందించడంలో దృష్టి సారిస్తుంది, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలపై శిక్షణ ఇస్తుంది.






