- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాదె ఇన్నారెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం: పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక
గాదె ఇన్నారెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం: పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ బచావో ప్రధాన కార్యదర్శి, సామాజిక కార్యకర్త గాదె ఇన్నారెడ్డిపై ఎన్ఐఏ పోలీసులు అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడాన్ని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తీవ్రంగా ఖండిస్తోందని పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక కన్వీనర్ సాంబమూర్తి పేర్కొన్నారు. కామ్రేడ్ కట్టా రామచంద్రా రెడ్డి అంత్య క్రియల సందర్భంగా ఇన్నయ్య మాట్లాడిన మాటల ఆధారంగా ఆయనపై కేసు బనాయించడం అప్రజాస్వామికమని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. కట్టా రామచంద్రా రెడ్డిది ఎన్ కౌంటర్ కాదని, అతన్ని పట్టుకొని హత్య చేశారనే అనుమానాలను ఇన్నయ్య వ్యక్తం చేశారని అన్నారు. ఇలాంటి ఫేక్ ఎన్ కౌంటర్ల తీరునే ఇన్నయ్య తీవ్రంగా ఖండించారని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటల ఆధారంగా క్రూరమైన, రాజ్యాంగ విరుద్దమైన ఉపా కేసు బనాయించడం బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు చేసిన కుట్ర అని విమర్శించారు. ఇది భావప్రకటనా స్వేచ్చ అనే హక్కును కాలరాయడమేనని తెలిపారు. ఇన్నయ్య నడుపుతున్న మన ఇల్లు అనే అనాధాశ్రమంలోకి పదుల సంఖ్యలో పోలీసులు ప్రవేశించడం, ఆశ్రమం చుట్టూ పోలీసులను మోహరించడం, ఆశ్రమంలో ఉన్న పిల్లలను, గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ప్రతి ఒక్కరూ ఖండిచాల్సిన చర్యగా సాంబమూర్తి పేర్కొన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యలను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని, ఇన్నయ్య అరెస్టును వ్యతిరేకించాలని కోరుతున్నామన్నారు. ఆయన విడుదలకై రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.






