‘అంబేద్కర్‌కు విప్లవ జోహార్లు’

by Disha Web Desk 6 |
‘అంబేద్కర్‌కు విప్లవ జోహార్లు’
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: సామాజిక వ్యవస్థలోని అన్యాయాలు, అసమానతలపై పోరాడిన అంబేద్కర్‌కు మావోయిస్టు పార్టీ విప్లవ జోహార్లు తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ అరెస్సెస్ - బీజేపీ అంబేద్కర్ భావజాలాన్ని చెత్త బుట్టలో కలిపేశాయని విమర్శించారు. కుట్ర ప్రకారం చేసిన ఎజెండాలో భాగంగా అంబేద్కర్ ను కాషాయ కిరీస్తున్నారని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించటంపై గర్వంగా ఫీల్ అవుతున్నామన్నారు. అయితే, అంత పెద్ద విగ్రహం ముందు ఆయన ఆలోచనలు, సూత్రాలను చిన్నవి చేశారని పేర్కొన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ ప్రస్తుతం దళితులను బుజ్జగించే పనిలో ఉన్నట్లు చెప్పారు. మోడీ పాలనలో దళితులపై దురాగతాలు పెరిగి పోయాయన్నారు. బ్రాహ్మణీయ హిందుత్వం, పెట్టుబడిదారు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed