ఆర్టీసీ విలీనంపై సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో సమీక్ష..

by Kema Shiva Kumar |

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో కీలక సమీక్ష జరిగింది.

ఆర్టీసీ విలీనంపై సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో సమీక్ష..
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై ఇవాళ సచివాలయంలో సమీక్ష జరిగింది. సీఎస్ రామకృష్ణారావు, రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రవాణా శాఖ కమిషనర్ ఇలంబరితి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియను పరిశీలించాలన భేటీలో నిర్ణయించారు. ఏపీలో విలీనం తర్వాత ఏర్పడిన ఇబ్బందులపైనా అధికారులు చర్చించారు. ఏపీకి వెళ్లి విలీన ప్రక్రియను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. విలీన కమిటీలో ఎవరెవరుండాలనే అంశంపై త్వరలో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story