- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై సమీక్ష : తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
ఇంగ్లీష్ మీడియం కేవలం బోధనా విధానం మాత్రమే కాదని, ఇది విద్యార్థుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన సాధనమని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అభిప్రాయపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంగ్లీష్ మీడియం కేవలం బోధనా విధానం మాత్రమే కాదని, ఇది విద్యార్థుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన సాధనమని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అభిప్రాయపడ్డారు. మాతృభాషకు ప్రాధాన్యతనిస్తూనే, ఇంగ్లీష్ ఆవశ్యకతను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సోమవారం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలను మెరుగుపరచడం అనే అంశాలపై ఉన్నత-స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ విద్యాశాఖ చైర్మన్ అకునూరి మురళి అధ్యక్షత వహించగా, తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మురళి మాట్లాడుతూ ప్రాంతీయ భాషా మాధ్యమాన్ని కొనసాగించడంలో ఉన్న ఆచరణాత్మక సవాళ్లను వివరించారు. ప్రజల దృక్పథంలో మార్పు వచ్చిందని, చాలామంది ఆంగ్ల మాధ్యమాన్ని అవకాశంగా భావిస్తున్నారని ఆయన అన్నారు. ఏదైనా విధానం రూపొందించేటప్పుడు పిల్లలు మరియు వారి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు.
విద్యార్థుల ఉన్నత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ సమస్యను బహిరంగంగా చర్చించడం చాలా ముఖ్యమని పలువురు విద్యా నిపుణులు ఈ సదస్సులో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ బిట్స్ పిలానీకి చెందిన డాక్టర్ విజయ్ కుమార్ తడకమళ్ల, డాక్టర్ సంతోష్ మహాపాత్ర బెంగుళూరు లోని ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ కి చెందిన డాక్టర్ ఎ. రాధాకృష్ణ, వంటి ప్రముఖులు కీలక వక్తలుగా పాల్గొన్నారు. ఈ చర్చల్లో ప్రధానం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు, ఉపాధ్యాయులకు శిక్షణ, పాఠ్యపుస్తకాల రూపకల్పన వంటి అంశాలపై దృష్టి సారించారు. గిరిజన ప్రాంతాల విద్యార్థులు ఆంగ్లం నేర్చుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారికి అనువైన బోధనా పద్ధతుల గురించి కూడా చర్చించారు. మాతృభాషలో ప్రాథమిక విద్యను అభ్యసించడంలో ప్రాముఖ్యతను కొందరు వక్తలు కూలంకషంగా వివరించారు.
- Tags
- Akunuri Murali






