ఓటరు జాబితాలో మార్పులు.. చేర్పులపై ఈసీ స్పెషల్ ఫోకస్

by Gantepaka Srikanth |

ఎస్ఐఆర్‌లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్‌పై ఆరు జిల్లాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులతో ఎన్నికల సంఘం అడిషనల్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఓటరు జాబితాలో మార్పులు.. చేర్పులపై ఈసీ స్పెషల్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఐఆర్‌లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్‌పై ఆరు జిల్లాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులతో ఎన్నికల సంఘం అడిషనల్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ ఓటర్ల ఎంట్రీ, కొత్త ఓటర్ల దరఖాస్తులు, అడ్రస్ మార్పులు, చనిపోయిన ఓటర్లకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 శాతం కంటే తక్కువగా ఓటర్ల మ్యాపింగ్ అయిందని, దీన్ని పెంచాలని ఈఆర్ఓ, ఏఈఆర్ఓలను ఆదేశించారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ.. 2002 ఓటరు జాబితాతో 2025 ఓటర్లను మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లతో సహాయం కూడా తీసుకోవాలన్నారు.

Next Story