కొత్త హెల్త్ కార్డులతో వైద్య సేవలు: ధన్యవాదాలు తెలిపిన ట్రెసా

by Gantepaka Srikanth |

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నూతన ఆరోగ్య పథకానికి శ్రీకారం చుట్టిందని రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి కొనియాడారు.

కొత్త హెల్త్ కార్డులతో వైద్య సేవలు: ధన్యవాదాలు తెలిపిన ట్రెసా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నూతన ఆరోగ్య పథకానికి శ్రీకారం చుట్టిందని రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా హెల్త్ కార్డును ఆయన హెల్త్ పోర్టల్ ని ప్రారంభించిన సందర్భంగా కార్డులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వంగ మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీ నుంచే కొత్త హెల్త్ కార్డులతో క్యాష్ లెస్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. హెల్త్ పోర్టల్ ద్వారా కొత్త కార్డులను వినియోగించుకోవచ్చునన్నారు. దశల వారీగా మొత్తం 886 అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందొచ్చునన్నారు. అలాగే అదనంగా 24 వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తారన్నారు. కార్యక్రమంలో ట్రెసా తరపున రాష్ట్ర అధ్యక్షులు, ఈహెచ్సీటీ బోర్డు సభ్యులు వంగ రవీందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ పి.రాజ్ కుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి, కో-ఆర్డినేటర్ ఎం. నారాయణ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.




Next Story