- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెసోళ్లను తొక్కుకుంటూ వచ్చిన చరిత్ర రేవంత్‌ది: హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్
పార్టీ కండువాలు మార్చి, కాంగ్రెసోళ్లను తొక్కుకుంటూ వచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ కండువాలు మార్చి, కాంగ్రెసోళ్లను తొక్కుకుంటూ వచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి (Revanth Reddy)ది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇవాళ మెదక్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ‘జాతిపిత’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లా త్యాగం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని ఆయన కొనియాడారు. ప్రాణాన్ని పణంగా పెట్టి కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఏనాడైనా కొట్లాడారా? అని ప్రశ్నించారు. అసలు 'జాతిపిత' అంటే రేవంత్‌కు అర్థం తెలుసా? అని దుయ్యబట్టారు.
గతంలో ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాదా..? అని హరీశ్ రావు సెటైర్లు వేశారు. పార్టీ కండువాలు మార్చి, కాంగ్రెస్ నేతలను తొక్కుకుంటూ పదవుల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన అని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణను సాధించకపోయి ఉంటే రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ వచ్చేదా? అని ప్రశ్నించారు. ఉద్యమ నాయకుడి గురించి మాట్లాడటానికి రేవంత్‌కు ఏం అర్హత ఉందని హరీశ్ రావు నిలదీశారు.






