- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌ను తిట్టడమే రేవంత్ ఎజెండా : మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
ఎక్కడికి వెళ్లినా కేసీఆర్‌ను తిట్టడమే సీఎం రేవంత్ ఎజెండాగా పెట్టుకున్నారని.. రాత్రి నిద్రలో కూడా కేసీఆర్‌నే కలవరిస్తున్నారని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎక్కడికి వెళ్లినా కేసీఆర్‌ను తిట్టడమే సీఎం రేవంత్ ఎజెండాగా పెట్టుకున్నారని.. రాత్రి నిద్రలో కూడా కేసీఆర్‌నే కలవరిస్తున్నారని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రతి దానికి కేసీఆర్ కారణం అనడం తప్ప రేవంత్ చేసిన మంచి పని ఏదీ లేదని విమర్శించారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వృత్తి కులాలకు ఏవైనా వరాలు ప్రకటిస్తారని ఆశించారని.. పాపన్న గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడతారని అనుకున్నామని చెప్పారు. ఎన్నికల్లో గౌడ కులస్తులకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని.. వాటి గురించి మాట్లాడకుండా రేవంత్ వేరే విషయాలు మాట్లాడారని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు అబద్ధాలే ఇప్పుడూ అబద్ధాలేనా అని నిలదీశారు. కేసీఆర్ 50 శాతంలోపు రిజర్వేషన్లకు చట్టం తెచ్చారని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని.. 62 శాతం రిజర్వేషన్ల కోసం ప్రయత్నించారని చెప్పారు.
సుప్రీంకోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే అని స్పష్టం చేశారు. రేవంత్ అబద్ధాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. 20 నెలల్లో 700 మంది గీత కార్మికులు వివిధ ప్రమాదాల్లో మరణించారని.. వారికి ఎక్స్‌గ్రేషియా సైతం చెల్లించడం లేదన్నారు. వైన్ షాపుల్లో గౌడ సోదరులకు 25 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వలేదని పేర్కొన్నారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని ఇప్పటివరకు పెట్టలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీఆర్ఎస్ నేత గౌతం ప్రసాద్ పాల్గొన్నారు.






