Revanth Reddy: ఆ విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా నేను రెడీ: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

తెలంగాణ నూతన విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Revanth Reddy: ఆ విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా నేను రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించిందని, దేశ విద్య విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై (Telangana New Education Policy) ఇవాళ సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయికి మన విద్యావిధానం సరితూగడం లేదని, ప్రతి యేటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతుంటే వారిలో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. విద్యాశాఖకు 21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుందని చెప్పారు. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడంమే నా ధ్యేయం అని విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. .

సమూల మార్పులు రావాలి:

పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం అన్న సీఎం.. 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలన్నారు. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలన్నారు. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయి. విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతుంది. అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా లక్ష్యం అని పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక బద్దంగా పనిచేయాలన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ లో లోపాలు ఉన్నాయన్న సీఎం.. 11 వేల ప్రైవేట్ స్కూల్స్ లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్‍ఆర్‍బీఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరినట్లు చెప్పారు.

Next Story