Bandi Sanjay : రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదు : బండి సంజయ్

by Muthe.Rajitha |

Bandi Sanjay : రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదు : బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం త్రివేణి సంగమం(Kaleshwaram Triveni Sangam)లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay ) పుణ్యస్నానం ఆచరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాల(Saraswati River Pushkaralu) సందర్భంగా బండి సంజయ్ కుటుంబ సమేతంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. ఆ పరమపావని అయిన సరస్వతీ నదీమ తల్లి మనల్నందరినీ చల్లగా చూడాలని అమ్మ వారిని వేడుకోవడంతో పాటు, ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వాముల కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అందాల పోటీల(Miss World)పై ఉన్న శ్రద్ధ పుష్కరాల నిర్వహణపై లేదని ఆరోపించారు. పుష్కరాల కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.35 కోట్లు ఏ మూలకూ సరిపోవని, ఈ మొత్తంతో సరైన ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని విమర్శించారు. గతంలో కేసీఆర్(KCR) సర్కారు గోదావరి పుష్కరాల కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేసిన సంగతిని గుర్తు చేస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పుష్కరాలను నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. పుష్కర ఘాట్లలో రద్దీ ఎక్కువ ఉందని, సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఈ వైఫల్యానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సినిమా ఈవెంట్లు, అందాల పోటీలపై దృష్టి పెడుతూ పుష్కరాల వంటి పవిత్ర కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Next Story