TG: ఆరోగ్యం ఎలా ఉంది?.. అసెంబ్లీలో కేసీఆర్ సీటు దగ్గరకు వెళ్లి పలకరించిన రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-12-29 05:42:30  IST  )

అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.

TG: ఆరోగ్యం ఎలా ఉంది?.. అసెంబ్లీలో కేసీఆర్ సీటు దగ్గరకు వెళ్లి పలకరించిన రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‍ ఇవాళ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‍కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. కేసీఆర్ సీటు దగ్గరకు వెళ్లి పలకరించిన రేవంత్ రెడ్డి.. ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ సీఎంను వాకబు చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క,ప్రభుత్వ విప్‍లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు సైతం కేసీఆర్ వద్దకు అభివాదం చేశారు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత సభకు హాజరైన కేసీఆర్ ఇవాళ సభలో జాతీయ గీతం, సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్‌ సభ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకం చేసిన కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా నందినగర్‍లోని తన నివాసానికి బయలుదేరారు. దీంతో మొదటి రోజు అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన కేసీఆర్ తీరు పట్ల ప్రత్యర్థులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అసెంబ్లీకి తొలి రోజు హాజరైన కేసీఆర్ తర్వాతి రోజుల్లో సభకు వస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.

Next Story