- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాన్ పరాగ్ తినే తలసాని నా గురించి మాట్లాడుతాడా.? రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పాన్ పరాగ్‌లు తినే తలసాని కూడా నా గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెప్పులు మోసిన తలసాని నాలా అధ్యక్షుడు కాలేడన్నారు. పెండ పిసికి, దున్నపోతులను కాసిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. వాటితో తిరిగి ఆయన కూడా దున్నపోతే అనుకుంటున్నారని రేవంత్ సెటైర్లు వేశారు. కాగా, మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ ఒక డిక్లరేషన్ ఇవ్వడానికి. ఆ పొట్టోడు మాట్లాడుతాడు.. ఎమ్మెల్యే లేదు.. మంత్రి లేదు.. వాడు వీడు అని. వాడున్న పర్సనాలిటీ గింత.. పిసికితే పాణం పోతది నాకొడుకు.. వాడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నడు.. మీరు ఆలోచన చేయాలి.. ప్రియాంక గాంధీ చెబుతది మా తాత ఇదుండే.. అదుండే.. మా నాయన’’ అంటూ తలసాని సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Also Read...
యూకే పర్యటనకు బయలుదేరిన కేటీఆర్
తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేస్తోన్న తలసాని కామెంట్స్.. కేసీఆర్‌కు మరో కొత్త తలనొప్పి..!






