- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM tour: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, డీకే అరుణ.. సీఎం జిల్లా పర్యటనలో ఆసక్తికర పరిణామం
సీఎం నారాయణపేట జిల్లా టూర్ లో అరుదైన ఘటన

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శల పర్వం పీక్స్ కు చేరుకుంది. ఏ చిన్న అవకాశం దొరికినా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ నేతలు పంచ్ డైలాగులతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంగా సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీజేపీ ఎంపీ డీకే అరుణకు (DK Aruna) మధ్య రాజకీయ విభేదాలు అందరికీ తెలిసిందే. సందర్భం వస్తే ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు విరుచుకుపడుతూ రాజకీయాన్ని మరింత ఆసక్తిగా మారుస్తుంటారు. అటువంటిది ఈ ఇరువురు నేతలు ఇప్పుడు ఒకే వేదికను పంచుకోవడం, సరదాగా ముచ్చటించుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నారాయణపేట జిల్లాలో (Narayanapet District) పర్యటించారు. అప్పక్ పల్లేలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ప్రారంభించారు. అనంతరం అక్కడి మహిళా సమాఖ్య సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేదికపై రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ డీకే అరుణ, మంత్రి సీతక్క తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, డీకే అరుణ సరదాగా మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది.
రేవంత్ వర్సెస్ డీకే:
పాలమూరు రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి, డీకే అరుణకు మధ్య పొలిటికల్ విభేదాలు ఏ రేంజ్ లో కొనసాగుతాయో రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నవారికైనా తెలుస్తుంది. ఇరువురు ఫైర్ బ్రాండ్ ల మధ్య చాలా కాలంగా రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యాక కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. గత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ మధ్య మాటల తూటాలు పేలాయి. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయాలపై డీకే అరుణ రేవంత్ రెడ్డిపై ఘాటు పదాలతో విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఉప్పు నిప్పుగా ఉన్న ఈ ఇరువురు నేతలు తాజాగా నారాయణపేట జిల్లా పర్యటనలో సరదాగా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.






