కొడంగల్ సాక్షిగా చెబుతున్నా.. KCRకు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు ఖాయం: రేవంత్ రెడ్డి

by Satheesh |   (  Updated:2023-11-27 12:56:52  IST  )

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన

కొడంగల్ సాక్షిగా చెబుతున్నా.. KCRకు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు ఖాయం: రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత ఇలాకా కొడంగల్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ గడ్డ నా అడ్డా.. మీ బిడ్డ, మీరు నాటిన మొక్క.. రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిందని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ మీరు పెంచిన ఈ చెట్టును నరికేందుకు సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ భుజాన గొడ్డలి వేసుకుని బయలుదేరిండ్రు.. వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కొడంగల్ గడ్డ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది.. ఈ స్ఫూర్తితోనే 20 ఏండ్లుగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడానని అన్నారు. అదే కొడంగల్ సాక్షిగా చెబుతున్నా.. కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దొరల, గడీల పాలన పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 3న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతుందని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి మరోసారి హామీ ఇచ్చారు.


Next Story