అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

ప్ర‌జాపాల‌న ప్ర‌గ‌తి ప్రాణాళిక‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం వేదిక‌గా విద్యా వారోత్స‌వాల‌ను ప్రారంభించారు. మే 17 వ‌ర‌కు వారోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. బ‌డుల అభివృద్ధి, ఉపాధ్యాయుల స‌మావేశాలు విద్యార్థుల ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జాపాల‌న‌-ప్ర‌గ‌తి ప్రణాళిక‌లో భాగంగా ఈ వారోత్స‌వాల‌ను సీఎం ప్రారంభించారు.

అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌జాపాల‌న ప్ర‌గ‌తి ప్రాణాళిక‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం వేదిక‌గా విద్యా వారోత్స‌వాల‌ను ప్రారంభించారు. మే 17 వ‌ర‌కు వారోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. బ‌డుల అభివృద్ధి, ఉపాధ్యాయుల స‌మావేశాలు విద్యార్థుల ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జాపాల‌న‌-ప్ర‌గ‌తి ప్రణాళిక‌లో భాగంగా ఈ వారోత్స‌వాల‌ను సీఎం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో విద్యను నిర్ల‌క్ష్యం చేశార‌ని అన్నారు. విద్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తే రాష్ట్రం వెనుక‌బ‌డిపోతుంద‌ని చెప్పారు. తెలంగాణ ఉద్య‌మంలో విద్యార్థులు ఉద్య‌మాన్ని ఉవ్వెత్తున ఉరికించార‌ని కొనియాడారు. విద్యార్థుల పోరాటం వ‌ల్లే స్వ‌రాష్ట్రం సాధ్యమైంద‌ని అన్నారు.

విద్యార్థుల త్యాగాల‌ను గుర్తించి యూనివ‌ర్సిటీల‌ను, విద్యాసంస్థ‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కుండా అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు. విద్య ద్వారానే మార్పు సాధ్య‌మౌతుంద‌ని అన్నారు. విద్య ద్వారానే స‌మాజంలో మార్పు తీసుకురాగ‌ల‌మ‌నే ఉద్యేశంతోనే విద్యాశాఖ‌ను త‌న‌వ‌ద్దే పెట్టుకున్నాన‌ని తెలిపారు. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే 11వేల పైగా టీచ‌ర్ నియామ‌కాల కోసం డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చి 60 రోజుల్లోనే నియామ‌క‌ ప్ర‌క్రియ పూర్తి చేశామ‌న్నారు. దాదాపు 20 ఏళ్లుగా టీచ‌ర్లకు ప్ర‌మోష‌న్లు లేవ‌ని నిరాశ‌తో ఉన్న 22వేల మంది టీచ‌ర్ల‌కు ప్ర‌మోష‌న్లు ఇచ్చామ‌ని తెలిపారు. టీచ‌ర్ల బ‌దిలీలు చాలా క‌ష్ట‌మైన ప‌ని అని, క‌లెక్ట‌ర్ల‌ను అవ‌లీల‌గా బ‌దిలీ చేయొచ్చు కానీ టీచ‌ర్లను బ‌దిలీ చేయ‌డం క‌ష్టం అన్నారు.

ఎలాంటి వివాదం లేకుండా టీచ‌ర్లు అడిగిన‌ద‌గ్గ‌ర‌కు బ‌దిలీ చేశామ‌ని అన్నారు. తెలంగాణ‌లోని విద్యావిదానాన్ని కేంద్ర ప్ర‌భుత్వ నీతి అయోగ్ అభినందించింద‌ని గుర్తు చేశారు. న‌ర్స‌రీ నుండి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స్కూల్స్ నిర్వ‌హిస్తామ‌ని మ‌రోసారి గుర్తు చేశారు. అంతేకాకుండా విదేశీవిద్య‌పై అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని చెప్పారు. ఉత్త‌మ టీచ‌ర్లు 500 మందిని గుర్తించి విదేశీవిద్య‌పై అధ్య‌య‌నం కోసం వారిని విదేశాల‌కు పంపిస్తామ‌ని అన్నారు. రాష్ట్రంలో కాస్మొటిక్ ఛార్జీల‌ను 200 శాతం పెంచామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌ను కుటుంబంలో ఒక‌రిగా చూస్తున్నామ‌ని ప్రైవేట్ పాఠ‌శాల‌ల కంటే మెరుగ‌య్యేలా స్కూళ్ల‌ను తీర్చి దిద్దాల‌ని కోరారు. విద్యాశాఖ నిధులను సైతం క్రమక్రమంగా పెంచుతామని హామీ ఇచ్చారు.

Next Story